కరాటేతో ఆత్మరక్షణ..
మహబూబాబాద్ రూరల్ : మా పాఠశాల ఉపాధ్యాయుడు వి.గురునాథరావు మాకు స్ఫూర్తి. ఆయన భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిగా మాత్రమే కాకుండా మా ఆలోచనలను వెలికితీసే మార్గదర్శి కూడా. ప్రతీ విద్యార్థిలో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసి కొత్త ఆలో చనలు కలిగేలా చేస్తారు. సార్ బోధించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. పుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రయోగాలు, ప్రాజెక్టులు, చర్చలు ద్వారా ఆ శాస్త్రంపై మాకు ఆసక్తి పెంచుతారు. ఆయన మార్గదర్శకంలో మేము ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, బయోడైవర్సిటీ కార్యక్రమాలు, యంగ్ ఇండియా ఇన్నోవేటర్స్ వంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. సార్ ఎప్పుడూ మీరు రేపటి శాస్త్రవేత్తలు అని చెబుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తారు. దీని వల్ల మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
–సాయిలేఖ్య, అంజలి కంబాలపల్లి,
జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు
కాజీపేట: కరాటేతో ఆత్మరక్షణతోపాటు మానసికోల్లాసం, శారీరక దృఢత్వం పెంపొందుతుంది. ఈ నేపథ్యంలో మడికొండ గ్రామానికి చెందిన మాస్టర్ కొలిపాక కుమారస్వామి.. పాత శివరామకృష్ణ పాఠశాల ఆవరణలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ క్రీడలో బాలబాలికలకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. కరాటే, కుంగ్ ఫూ మాస్టర్ల పర్యవేక్షణలో వారంలో మూడు రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు.
జఫర్‌గఢ్: మండలంలోని తిమ్మంపేటకు చెందిన విద్యార్థిని ఇల్లందుల సమ్మిళిత పలు రకాల బొమ్మలు అద్భుతంగా గీస్తూ తన ప్రతిభను చాటుతోంది. హనుమకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సమ్మిళితకు బొమ్మలు గీయడం అంటే ఇష్టం. ఇటీవల పాఠశాలలకు సెలవులు రావడంతో ఇంటి వద్దే ఉంటున్న సమ్మిళిత ఖాళీ సమయంలో బొమ్మలు గీస్తోంది. జాతీయ నాయకులతోపాటు ప్రకృతి, దేశ సంస్కృతి, సంప్రదాయానికి సంబంధించి పలు చిత్రాలు గీస్తోంది. వేసవి సెలవులను వృథా చేయకుండా ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది.
సమ్మిళిత గీసిన బొమ్మలు
అమ్మమ్మ చెప్పినకథ
నక్క–డేగ
● జె.సహస్ర, 7వ తరగతి,
ఫాతిమా హైస్కూల్, కడిపికొండ
హయ్. నా పేరు సహస్ర. నేను కడిపికొండలోని ఫాతి మా హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నా. సమ్మర్ హాలీడేస్‌కు మా అమ్మమ్మ ఊరికి వెళ్లా. అక్కడ మా అమ్మమ్మ మంచి కథలు చెప్పింది. ఇందులో అపాయంలో ఉపాయంతో బయటపడాలనే నీతి కథ నాకు బాగా నచ్చింది. అడవిలో ఓ నక్క ఓ చెట్టు కింద తన పిల్లలతో నివసిస్తూ ఉండేది. అదే అడవిలో ఆ చెట్టుపై డేగ గుడ్లు పెట్టింది. కొన్ని రోజులకు పిల్లలు పుట్టిన తర్వాత వాటి ఆహారం కోసం వెదకసాగింది. ఇంతలో డేగకు నక్క పిల్లలు కనిపించాయి. తన పిల్లలకు ఆహారంగా నక్క పిల్లలను తీసుకెళ్లి తన గూడులో పెట్టింది. నక్క వచ్చి తన పిల్లలను తనకు ఇవ్వాలని డేగను అడగగా నేను ఇవ్వనని, నీ పిల్లలు నా పిల్లలకు ఆహారంగా మారుతారని అని చెప్పింది. దీంతో నక్కకు ఒక ఆలోచన వచ్చింది. సమయ స్ఫూర్తితో అపాయంలో ఉపాయం ఆలోచించింది. ఒక కొరివితో డేగను నా పిల్లలను నువ్వు ఇవ్వకపోతే నీ పిల్లలను కొరివికి ఆహుతి చేస్తానని బెదిరించింది. దీంతో గత్యంతరం లేక డేగ.. నక్క పిల్లలను ఇచ్చేసింది.– కాజీపేట అర్బన్
కరాటేతో ఽధైర్యం వచ్చింది..
కరాటే మెళకువలతో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఏర్పడింది. మానసికోల్లాసం కలుగుతోంది. ఈ క్రీడ ఆడపిల్ల లకు అవసరం. మాస్టర్లు నేర్పిన అంశాలను ప్రాక్టీస్ చేస్తున్నాం.
–దివ్య, కాజీపేట
ఉత్సాహం చూపుతున్నారు..
కరాటే నేర్చుకోవడానికి బాలబాలికలు ఉత్సాహం చూపుతున్నారు. వ్యాయామంతోపాటు కరాటేలోని టెక్నిక్ నేర్చుకుంటున్నారు. వారిపై దాడులు జరిగే క్రమంలో తమను తాము ఎలా రక్షించుకోవాలనే అంశంపై ఎక్కువగా దృష్టి సారించాం.
–కొలిపాక కుమారస్వామి, కరాటే మాస్టర్
నీతి : ఆపద సమయంలో ఆవేశపడకూడదు. నెమ్మదిగా ఆలోచించి అపాయం నుంచి బయటపడాలి
కోటగుళ్ల వద్ద కమలాపూర్ పీఎంశ్రీ ఎంజేపీ విద్యార్థులు
–స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్
మేము చూశాం.. మీరూ చూడండి
కమలాపూర్: భూపాలపల్లి జిల్లా గణపురంలోని ఉ న్న కోటగుళ్లను మేము చూశాం.. మీరు చూడండి అంటున్నారు హనుమకొండ జిల్లా కమలాపూర్ పీ ఎంశ్రీ ఎంజేపీ విద్యార్థులు. ఈ మేరకు ఆ విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో కలిసి గత మార్చిలో కోటగుళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా తమ అనుభూతిని పంచుకున్నారు. ‘కాకతీయుల కాలంలో వివిధ పరిమాణాల్లో నిర్మించిన 22 గుడుల స మూహాన్ని కోటగుళ్లు అంటారు. శిల్పకళా వైభవా నికి నిదర్శనంగా నిలుస్తున్న ఈ కోటగుళ్లను తప్ప క చూడాల్సిందే’ అని వారు పేర్కొంటున్నారు.
వేసవిలో పిల్లలకు ఉచిత శిక్షణ
వారంలో మూడురోజుల పాటు
నిర్వహణ


