రైతు డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌! | - | Sakshi
Sakshi News home page

రైతు డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌!

May 6 2026 9:19 AM | Updated on May 6 2026 9:19 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌: వరంగల్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కిందని, రైతుల విషయంలో ఆ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటిని విస్మరించిందని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీలు.. 420 హా మీలను గాలికి వదిలివేసిందని వారు ఆరోపించారు. హ నుమకొండ హంటర్‌రోడ్డులో రైతు సంగ్రామ సదస్సు వేదిక వద్ద మంగళవారం పార్టీ హనుమకొండ జిల్లా అ ధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేతలు, ప్ర జాప్రతినిధులు మాట్లాడారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాష్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ హయాంలో వ్యవసాయం పండుగగా మారిందని, కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దండగగా మారిందని అన్నారు. రాష్ట్రంలో రైతుల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాడుతోందని, రైతు సంగ్రామ సదస్సుకు పోటీగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు మేళా ఏర్పాటు చేశారని, తమ సదస్సుకు అనేక అవరోధాలు అడ్డంకులు సృష్టించారన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రైతుల గోసను రైతు సంగ్రామ సభ ద్వారా ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైతు రుణమాఫీకి రూ.36వేల కోట్లు అవసరమైతే రూ.18వేల కోట్లు వేసి చేతులు దులుపుకున్నారన్నారు. కేసీఆర్‌ రైతుబంధు వరినాట్ల ముందు ఇచ్చారని, ఇప్పుడు అతీగతీ లేదని, మొక్కజొన్న పంట కొనుగోళ్లు చేపట్టడం లేదని, దమ్ముంటే వరంగల్‌ మార్కెట్‌కు రండి అని సవాల్‌ విసిరారు. దాస్యం వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ రైతులకు మద్దతుగా సదస్సు పెడుతుంటే పార్టీ తోరణాలు, ఫ్లెక్సీలు తొలగిస్తున్నారన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం బీఆర్‌ఎస్‌ పోరాడిందని, ప్రజాపాలన పేరిట ప్రజా కంఠక పాలన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పంటల కొనుగోళ్లు లేవన్న ఆయన రైతుల కోసమే రైతు సంగ్రామ నిర్వహిస్తున్నామని, దీనికి కేటీఆర్‌ హాజరవుతున్నారని అన్నారు. మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ మా ట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు గుర్తు చేసేందుకే నిర్వహిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో రైతులకు జరిగి న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. అనంతరం రైతు సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు రమేశ్‌, నరేందర్‌, రాజయ్య, నాయకులు వెంకటేశ్వర్లు, యాదవరెడ్డి, వాసుదేవ రెడ్డి, హరిరమాదేవి, సాంబారి సమ్మరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రెస్‌మీట్‌లో బీఆర్‌ఎస్‌ నేతలు

Advertisement
 
Advertisement
Advertisement