నెహ్రూసెంటర్: కార్మిక లోకానికి ఎర్రజెండా అండగా నిలుస్తుందని సీపీఎం జిల్లా జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అన్నారు. మే డేను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలో సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ. కార్మికులు పోరాటాల ఫలితంగా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చిన నరేంద్ర మోదీ కార్మిక ద్రోహి అన్నారు. ఐక్య పోరాటాలతోనే కార్మిక హక్కులు సాధించుకుంటామని, మే డే స్ఫూర్తితో లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మికులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చా రు. మున్సిపల్ వైస్ చైర్మన్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సోమయ్య, ఆకుల రాజు, సీఐ టీయూ జిల్లా కార్యదర్శి రాజమౌళి, జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి నాగన్న, రాజు పాల్గొన్నారు.
మోదీకి పతనం తప్పదు..
నరేంద్ర మోదీకి వచ్చే ఎన్నికల్లో పతనం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి అన్నారు. మేడే సందర్భంగా శుక్రవారం సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మానుకోట పట్టణంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. విజయసారథి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మోదీ పతనం తప్పదన్నారు. కార్మికులు, దేశ ప్రజలందరూ బీజేపీపై పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజయ్‌సారథి రెడ్డి, పెరుగు కుమార్, రేసపల్లి నవీన్, వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, కట్లోజుపాండురంగ చారి పాల్గొన్నారు.
లేబర్ కోడ్స్ రద్దు కోసం పోరాటాలు
ర్యాలీలతో ఎరుపెక్కిన మానుకోట


