కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి | - | Sakshi
Sakshi News home page

కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌

మహబూబాబాద్‌: ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినో త్సవం సందర్భంగా మేడే వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన– ప్రగతి ప్రణా ళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా మేడే వేడుకలు నిర్వహించామన్నారు. ఈనెల 2 నుంచి 10వ తేదీ వరకు కార్మికశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాల కార్మికులకు సంబంధించిన ఫిర్యాధులపై తక్షణమే స్పందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సహాయ కార్మిక కమిషనర్‌ రమేశ్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement