ఉపాధి హామీతో గ్రామీణులకు ఆర్థిక భరోసా | - | Sakshi
Sakshi News home page

ఉపాధి హామీతో గ్రామీణులకు ఆర్థిక భరోసా

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క

ములుగు: ఉపాధి హామీ పథకంతో గ్రామీణ ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మండలంలోని కేశవపూర్‌ గ్రామ సమీపంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా పలుగు, పార పట్టుకుని మంత్రి సీతక్క కూలీలతో కలిసి పనిచేశారు. కూలీల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వారి పనితీరును అభినందించారు. అనంతరం కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి, తీవ్ర ఎండల నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం సింగరకుంటపల్లిలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని సీతక్క ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోతు రవిచందర్‌, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్‌ గౌడ్‌, నాయకులు బైరెడ్డి భగవాన్‌రెడ్డి, చెన్నోజు సుర్యనారాయణ, బండి శ్రీనివాస్‌, సుమన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement