నేను బిహార్ నుంచి వచ్చినప్పటికీ కేఎంసీ నాకు ఎంతో నేర్పింది. ఇక్కడ పేషెంట్లకు ఇబ్బందవుతుందని తెలుగు భాష నేర్చుకున్నా. మా నాన్న పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్సై అయినప్పటికీ నన్ను డాక్టర్‌గా చూడాలనుకున్నారు. చదువుతో పాటు ఆటల్లోనూ రాణించా. తోటి విద్యార్థులు ఇక్కడ కుటుంబ సభ్యుల్లా అందరం కలిసి చదువున్నాం. కేఎంసీలో జీవితం విలువ తెలుసుకున్నా. భవిష్యత్‌లో ఎలా ఉండాలో ఇక్కడే శిక్షణ పొందినట్లుగా ఉంది. జనరల్ సర్జన్ అవ్వాలన్నది నా డ్రీమ్.
– డాక్టర్ అంకిత్‌కుమార్, గోల్డ్ మెడలిస్ట్, బిహార్


