దేవరుప్పుల : ఇటీవల విడుదలైన పదో తరగతి వార్షిక ఫలితాల్లో అనేకమంది విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించారు. విద్యార్థుల విజయంలో సాక్షి యాజమాన్యం అందించిన మెటీరియల్ ఎంతగానో దోహదపడిందని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. సాక్షి మెటీరియల్‌తో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఈసందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సులభతరంగా మెటీరియల్..
పదో తరగతి విద్యార్థులకు గణితం, ఫిజికల్ సైన్స్ పాఠ్యాంశాలపై కొంత ఆందోళన ఉంటుంది. ఈ భయాన్ని పోగొట్టేందుకు సాక్షి దినపత్రిక ప్రముఖ విద్యానిపుణులు, సీఎస్‌ఆర్ సంస్థ సౌజన్యంతో అత్యంత సులభమైన పద్ధతిలో మెటీరియల్ రూపొందించి విద్యార్థులకు అందించడంతో వారు ఉత్తమ మార్కులు సాధించారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు హైస్కూళ్లకు చెందిన అనేక మంది విద్యార్థులకు దాతల సాయంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఉచితంగా మెటీరీయల్ అందజేశారు. విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణతోపాటు సాక్షి దినపత్రిక పదో తరగతి పాఠ్యాంశాలపై సమగ్ర సమాచారం, మోడల్ పేపర్లను ప్రచురించింది. దీంతో విద్యార్థులు గతంకంటే మెరుగైన ఫలితాలను సులభంగా సాధించగలిగారు.
టెన్త్ విద్యార్థులకు మెటీరియల్
అందించిన సాక్షి యాజమాన్యం
వినియోగించుకున్న విద్యార్థులు
మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత


