బాలలకు భరోసా ఎంతో అవసరం | - | Sakshi
Sakshi News home page

బాలలకు భరోసా ఎంతో అవసరం

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

కాశిబుగ్గ: ప్రస్తుత పరిస్థితుల్లో బాలలకు భరోసా కల్పించడం ఎంతో అవసరమని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా చైల్డ్‌ సేఫ్టీ అండ్‌ ప్రొడక్షన్‌– డ్రగ్స్‌ నో అనే అంశంపై ఏప్రిల్‌ 27 నుంచి మే 2 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖల సమన్వయంతో శుక్రవారం ఓ సిటీ స్టేడియంలో బాలభరోసా కార్యక్రమం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. బాలల భరోసా కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సూ చించారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి పౌష్టికాహారం తీసుకోవా లని పేర్కొన్నారు. సరైన పోషణ ఉన్నప్పుడే పిల్లలు శారీరక, మానసిక ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. బాలల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద, అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, కార్పొరేటర్‌ ఓని భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఆరోగ్య శిబిరం వద్ద ఉన్న ప్రత్యేక అవసరాల ఉన్న పిల్లల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వారికి తగిన వైద్య చికిత్సలు అందే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన సమ్మర్‌ క్యాంపును ప్రారంభించారు. వివిధ రకాల క్రీడలను తిలకించారు. ఈసందర్భంగా మంత్రి కొండా సురేఖతోపాటు కలెక్టర్‌ సత్యశారద క్రికెట్‌ ఆడారు.

రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ

మంత్రి కొండా సురేఖ

Advertisement
 
Advertisement
Advertisement