శిక్షణ శిబిరాల జాడేది..? | - | Sakshi
Sakshi News home page

శిక్షణ శిబిరాల జాడేది..?

May 1 2026 6:09 AM | Updated on May 1 2026 6:09 AM

సమ్మర్‌ క్యాంపులు ఉన్నట్టా.. లేనట్టా?

శిబిరాల ఏర్పాటులో నిర్లక్ష్యం

సెలవుల నిమిత్తం ఊర్లకు వెళ్తున్న

చిన్నారులు

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లాలో గిరిజన, ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే సమ్మ ర్‌ క్యాంపులు ప్రారంభించారు. అయితే జిల్లా యు వజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో మాత్రం క్యాంపులు ప్రారంభించలేదు. దీంతో చిన్నారులు క్రీడలకు దూరమవుతున్నారు. ఇప్పటికై నా శిక్షణ శిబి రాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

క్రీడలకు పుట్టినిల్లులాంటిది..

మానుకోట జిల్లా క్రీడలకు పుట్టినిల్లులాంటిది. ఈ ప్రాంతం నుంచి అనేక మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. అనేక మంది క్రీడాకారులు పీఈటీలు, పీడీలుగా, రైల్వే ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారు. కాగా, పిల్లలకు వేసవి సెలవులు ప్రారంభం అయ్యాయి. సొంత ఊళ్లకు, విహారయాత్రలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే సెలవుల్లో వారి అభిరుచికి తగినవిధంగా క్రీడల్లో రాణించేలా సహాయపడాలి.

క్రీడలతో ఉపయోగాలు..

క్రీడలు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతాయి. ఆటలు బాగా ఆడటం వల్ల శారీరక శ్రమ కలుగుతుంది. ఎముకలు, కండరాల పెరుగుదల, మంచి రక్త ప్రసరణ, పిల్లల వయసుకు తగ్గ బరువు, అలాగే మెదడు, గుండె చక్కగా పని చేస్తాయి. ఇలాంటి ప్రయోజనాలు ఉన్న క్రీడలపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. ప్రతీ సంవత్సరం జిల్లా క్రీడల శాఖల, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు సరైన సమయంలో ఏర్పాటు చేస్తే పిల్లలు, క్రీడాకారులు క్రీడలపై మక్కువ చూపి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంది. కాగా, జిల్లా యంత్రాంగం వేసవి శిక్షణ శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పలువులు క్రీడాకారులు కోరుతున్నారు.

సమ్మర్‌ క్యాంపుల్లో క్రీడలు ఇలా..

మున్సిపల్‌ పరిధిలోని సమ్మర్‌ క్యాంపులో బాస్కెట్‌ బాల్‌, తైక్వాండో, క్రికెట్‌, అథ్లెటిక్స్‌, హాకీ, స్విమ్మింగ్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, చెస్‌, క్యారమ్‌ తదితర క్రీడలు నిర్వహిస్తారు. అలాగే గ్రామాల్లో సమ్మర్‌ క్యాంపులో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, సాఫ్ట్‌బాల్‌, బాల్‌బ్యాడ్మింటన్‌, చెస్‌, క్యారమ్‌ క్రీడలు నిర్వహిస్తారు. విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇస్తే జిల్లాకు మంచి పేరుప్రఖ్యాతులు తీసుకువస్తారని పలువురు క్రీడాకారులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement