● అదనపు కలెక్టర్ అనిల్ కుమార్
మహబూబాబాద్ అర్బన్: స్వీయ జనగణనలో ఇళ్లు, ప్రాథమిక సమాచార వివరాలు నమోదు చేయాలని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం అన్ని శాఖ అధి కారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 11నుంచి ప్రారంభమయ్యే స్వీయ జనగణన సర్వే కార్యక్రమంలో సులభతరంగా తమ వివరాలను నమోదు చేయడం కోసం ముందస్తుగా స్వీయ జనగణన వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లా పౌర సంబంధాలశాఖ కార్యాలయంలో ముందుగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు స్వీయ జనగణన కార్యక్రమం నిర్వహించి అవగాహస కల్పించామన్నారు. ప్రతీ ఒక్కరూ తమ వివరాలను బాఽ ద్యతాయుతంగా సమర్పించాలని కోరారు. కార్యక్రమంలో ముఖ్యప్రణాళిక అధికారి శ్రీనివాస్‌రావు, డీఎస్పీ తిరుపతిరావు, డీపీఆర్‌ఓ పసునూరి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.


