హన్మకొండ: క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్ సిబ్బందికి రక్షణ కల్పించాలని తెలంగాణ విద్యుత్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పి.శ్రీనివాస్, కన్వీనర్ మన్నె శశికుమార్ టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్న వా రిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఒక ప్రకట నలో కోరారు. టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ రూరల్ డివిజన్ పరిధి కాపుల కనపర్తి సెక్షన్ రామచంద్రాపురంలో బకాయి విద్యుత్ బిల్లుల వసూళ్లకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిని ఓ వినియోగదారుడు భయభ్రాంతులకు గురి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. జేఎల్‌ఎం జన్ను మధుమోహన్ ఇంటికి వెళ్లి బకాయిదారు డు అసభ్యపదజాలంతో దూషించి కుటుంబీకులను భయభ్రాంతులకు గురి చేశాడని వివరించారు. అంతటితో ఆగకుండా మధుమోహన్‌పై దాడి చేసేందుకు లో హిత, కాపుల కనపర్తి సబ్ స్టేషన్లకు వెళ్లి వెతికాడని, కనిపించకపోవడంతో సబ్ స్టేషన్‌లోని సిబ్బందిని బెదిరించాడని తెలిపారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేఎల్‌ఎం మధుమోహన్ కుటుంబానికి నైతిక మద్దతు ఇవ్వడంతో పాటు రక్షణ కల్పించాలన్నారు.
దాడులకు పాల్పడుతున్న వారిపై
కఠిన చర్యలు తీసుకోవాలి
తెలంగాణ విద్యుత్ జేఏసీ విజ్ఞప్తి


