హన్మకొండ అర్బన్ : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈనెల 8న నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్‌ను గురువారం హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ నగరంలోని నాక్ సెంటర్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ సమీపంలో ఈ మేళా ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ రంగానికి చెందిన పలు ప్రముఖ సంస్థలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని వివరించారు. ఉద్యోగార్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, బయోడేటాలతో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


