వడదెబ్బతో కౌలు రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో కౌలు రైతు మృతి

May 1 2026 6:09 AM | Updated on May 1 2026 6:09 AM

నెక్కొండ : వడదెబ్బతో వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన కౌలురైతు ఒర్రె మల్లయ్య (52) గురువారం మృతి చెందాడు. మల్లయ్య మండలంలోని దేవునితండా జీపీ పరిధి లోని దుబ్బతండాలో 4 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇందులో రెండెకరాల్లో మొక్కజొన్న, మరో రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. రెండు రో జులుగా మక్కల ఆరబెట్టేందుకు చేను వద్దకు వెళ్లా డు. ఈ క్రమంలో వడదెబ్బ తగలడంతో అక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శోభ, కుమారు డు, కూతురు ఉన్నారు.

దుబ్యాలలో మహిళా కూలీ..

టేకుమట్ల: వడదెబ్బతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం దుబ్యాలకు చెందా న మహిళా కూలీ సంగి సుజాత(38) మృతి చెందింది. రోజుమాదిరిగానే సుజాత గురువారం ఉదయం మొక్కజొన్న కంకిపొట్టు తీ సేందుకు వెళ్లింది. ఇంటికి వచ్చిన అనంతరం మ ధ్యాహ్నం అస్వస్థకు గురి కావడంతో చికిత్స నిమి త్తం చిట్యాల సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, సుజాత కుటుంబాన్ని మాజీ ఎంపీటీసీ సంగి, బి.ఉమేందర్‌రావు పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement