ఫెయిలవుతానన్న భయంతో విద్యార్థిని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఫెయిలవుతానన్న భయంతో విద్యార్థిని ఆత్మహత్య

May 1 2026 6:09 AM | Updated on May 1 2026 6:09 AM

ఫలితాల్లో పాస్‌.. కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు

దుగ్గొండి: పదో తరగతి పరీక్షలు సరిగా రాయలేదు. ఫెయిల్‌ అయితే తల్లిదండ్రులు తిడతా రనే భయంతో అధిక మోతా దులో నిద్రమాత్రలు మింగి బా లిక ఆత్మహత్య చేసుకుంది. తీ రా బుధవారం వెలువడిన ఫలితాల్లో పాస్‌ అయింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటన గత నెల 21న జరగగా ఆలస్యంగా గురువారం వెలుగులోకి వ చ్చింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం మల్లంపల్లికి చెందిన తెప్ప భిక్షపతి–సుమలత దంపతుల కూ తురు నవ్య(17) నర్సంపేట మండలం గురిజాల లోని తన పెద్దమ్మ వద్ద ఉండి చదువుకుంది. స్థానిక పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన నవ్య పరీక్షలు సరిగా రాయలేదని అమ్మా, నాన్నలు మందలి స్తారనే భయంతో గత నెల 21న బీపీ మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. తీరా ఫలితాలు రా గా 336 మార్కులతో పాసైంది. గురువారం దశదిన కర్మ కావడంతో తల్లిదండ్రులు, బంధువులంతా నవ్య పరీక్షల భయం, పాసైన తీరును తలచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

మనస్తాపంతో యువకుడు..

మహబూబాబాద్‌ రూరల్‌: కు టుంబ తగాదాలతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూ బాబాద్‌ మండలం బలరాం తండా గ్రామానికి చెందిన కేలోత్‌ శేఖర్‌ (26)కు జిల్లా కేంద్రం శివారు సాలార్‌ తండాకు చెందిన సౌజన్య తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. శేఖర్‌ ఖాళీగా తిరుగుతుండడంతో సౌజన్య పలుమార్లు మందలించేది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇద్దరి మ ధ్య వాగ్వాదం జరగగా సౌజన్య తన కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లగా కుమార్తె శేఖర్‌ వద్దే ఉంది. దీంతో శేఖర్‌ అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి బావుసింగ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నట్లు రూరల్‌ హెచ్‌సీ మధుసూదన్‌ గురువారం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement