వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన 41వ సౌత్‌జోన్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్‌షిప్ పోటీలు ముగిశాయి. ఆరు రాష్ట్రా ల నుంచి పాల్గొన్న జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. గురువారం జరిగిన ఫైనల్‌లో పురుషుల విభాగంలో తమిళనాడు, తెలంగాణ జట్టు తలపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 32–22 గోల్స్‌తో తమిళనాడు విజేతగా నిలిచింది. ఆతిథ్య తెలంగాణ రన్నరప్‌గా నిలిచింది. మహిళల విభాగంలో తమిళనాడు, కేరళ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు విజయం సా ధించింది. రెండో స్థానంలో కేరళ నిలవగా, ఆతిథ్య తెలంగాణ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ము గింపు వేడుకలకు షైన్ విద్యా సంస్థల చైర్మన్ మూ గల కుమార్, హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్ హాజరై విజేతలకు ట్రోఫీ, పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పోటీలతో క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి, తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ మాట్లాడుతూ ఈ పోటీలకు సహకరించిన రెఫరీ, అధికారులు, పీఈటీలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, తెలంగాణ జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ బైరబోయిన కై లాస్‌యాదవ్, ఖోఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తోట శ్యామ్‌ప్రసాద్, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ బాధ్యులు బసరవేణి లక్ష్మణ్‌గాయు, తిరుమల్‌రెడ్డి, పుల్లయ్య, శంకర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
పురుషుల విభాగంలో రన్నరప్ తెలంగాణ
మహిళల విభాగంలో మూడో స్థానం..


