దళారులను నమ్మి మోసపోవద్దు | - | Sakshi
Sakshi News home page

దళారులను నమ్మి మోసపోవద్దు

Apr 30 2026 8:43 AM | Updated on Apr 30 2026 8:43 AM

ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌

గూడూరు: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ సూచించారు. మండల కేంద్రంతో పాటు మచ్చర్ల, అయోధ్యాపురం, బొల్లెపల్లి, తీగలవేణి గ్రామాల్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఓ అబ్దుల్‌, ఉపసర్పంచ్‌ చంటిస్వామి, నాయకులు బీరం శ్రీపాల్‌రెడ్డి, బొల్లికొండ మధు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement