కేసముద్రం: మున్సిపాలిటీ పరిధి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన జిజ్ఞాస స్టూడెంట్స్ స్టడీ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ డి.రాజు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతరిస్తున్న పల్లె గీతాలు, కేసముద్రం ప్రాంత జానపద గేయాలు అనే అంశంపై ఈ పరిశోధన ప్రాజెక్టును చేపట్టారని, ఈమేరకు రాష్ట్రస్థాయికి ఎంపికై ందన్నారు. మే నెలలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు.
కలెక్టర్‌కు కలిసిన డిప్యూటీ డైరెక్టర్
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ హాస్టల్ పదో తరగతి విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించిన నేపథ్యంలో బుధవారం కలెక్టర్ స్నేహ శబరీష్‌ను గిరిజన డిప్యూటీ డైరెక్టర్ గుగులోతు దేశీరాంనాయక్, జిల్లా విద్యాశాఖ పరీక్షల విభాగం అధికారి మందుల శ్రీరాములు, ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి శ్రీనివాస్‌రావు మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ఈ విద్యాసంవత్సరం ఉత్తమ మార్కులు సాధించి జిల్లాను 5వ స్థానంలో నిలిపిన విద్యార్థులకు శుభాంకాక్షలు తెలుపుతున్నామన్నారు. రానున్న రోజుల్లో జిల్లాను మొదటిస్థానంలో నిలపాలని సూచించారు.
ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్‌గా జెడ్పీ సీఈఓ
మహబూబాబాద్: జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టొప్పో ఇటీవల ములుగు జిల్లా ఏటురూనాగారం ఐటీడీఏ పీఓగా బదిలీ అయిన విషయం విదితమే. కాగా ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్‌గా జెడ్పీ సీఈఓ పురుషోత్తంకు బాధ్యతలు ఇస్తూ కలెక్టర్ స్నేహ శబరీష్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
డీజిల్ లోకో షెడ్ అభివృద్ధికి సమష్టి కృషి
కాజీపేట రూరల్: కాజీపేట డీజిల్ లోకో షెడ్‌కు సమష్టి కృషితోనే దేశంలో మంచి గుర్తింపు లభించిందని డీజిల్ షెడ్ సీనియర్ డీఎంఈ ఎన్.వి.వెంకటకుమార్ అన్నారు. మంగళవారం రాత్రి డీజిల్ లోకో షెడ్ 53 వసంతాల వేడుకలు కనులపండువగా జరిగాయి. రైల్వే సీనియర్ డీఎంఈ వెంకటకుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించి మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ అధికారుల సహకారంతో డీజిల్ షెడ్ రైల్వే అధికారులు, సూపర్‌వైజర్లు, రైల్వే కార్మికులు విధుల నిర్వహణలో మంచి ఫలితాలతో 53 వసంతాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీనియర్ డీఈఈ కేవీ.హరికృష్ణ కేక్ కట్ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఎంఈ అనికేత్ ఖడ్గే, ఎడీఎంఈలు శ్రీనివాస్‌రావు, నాగరాజశేఖర్, ఏడిఈ సతీశ్‌కుమార్, ఏసీఎంటీ మల్లికార్జునరావు, ఎ.ఎం.ఎం రాజేశ్, కాజీపేట స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ జోనల్ ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాస్, యూనియన్ డీజిల్ బ్రాంచ్ నాయకులు పాక వేదప్రకాశ్ పాల్గొన్నారు.


