● ఎస్పీ డాక్టర్ శబరీష్
మహబూబాబాద్ రూరల్ : ప్రజల భద్రత కోసం పోలీసు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడు కృషి చేస్తారని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూసెంటర్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోస్టులో వాటర్ మిస్ట్ స్ప్రింక్లర్స్ ఆధారిత కూలింగ్ సిస్టంను ఏర్పాటు చేసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ సిస్టమ్ ద్వారా నీరు మిస్ట్ రూపంలో చల్లదనం కలిగించడం ద్వారా ఎండలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి తక్షణ ఉపశమనం కలుగుతుందన్నారు. అలాగే ట్రాఫిక్ సిబ్బందికి మిల్టన్ వాటర్ ఫ్లాస్క్‌లు, చల్లటి కంటి అద్దాలు పంపిణీ చేశామన్నారు. ప్రజల భద్రత కోసం తీవ్ర ఎండల్లోనూ అంకితభావంతో పనిచేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యం కాపాడడం పోలీస్ శాఖ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. వేసవి కాలంలో హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి సమస్యలను నివారించేందుకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్సై అరుణ్ కుమార్, ట్రాఫిక్ సిబ్బంది రాంచందర్, భాస్కర్, పాపాలాల్, వెంకన్న, రామకృష్ణ, మోహన్ తదితరులు పాల్గొన్నారు.


