మహబూబాబాద్ రూరల్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని, కొనుగోలు కేంద్రాల్లో పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మాధవాపురం, పర్వతగిరి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మురళీనాయక్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తుందన్నారు. రైతు సంక్షేమం కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి ఆర్థికంగా లబ్ధి పొందాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు వెంపటి రమేశ్, చల్ల అనితవెంకన్న, కాంగ్రెస్ నాయకులు మద్ది వెంకటరెడ్డి, బంటు అంజయ్య, గడిసందు అశోక్, రాంపల్లి నరేశ్, భరత్, పుల్క వెంకటాద్రి, మందుల శ్రీను, చిన్నం నాగన్న, రైతులు తదిత రులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మురళీనాయక్


