కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లోని మార్క్‌ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రంలో మక్కలు పేరుకుపోవడంతో కొనుగోళ్లను బంద్ చేశారు. కాంటాలు పూర్తయినప్పటికీ డీజిల్ కొరతతో లారీలు రాకపోవడంతో ఎగుమతి చేయలేదు. దీంతో రైతులు రోజుల తరబడి పడిగాపులు పడాల్సివస్తోంది. మార్కెట్‌లో 50వేల బస్తాలు పేరుకుపోయినట్లు అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు మార్కెట్‌కు మక్కల ట్రాక్టర్లు రాకుండా మున్సిపాలిటీ ప రిధిలో చుట్టుపక్కల ప్రధాన రహదారులపై పో లీసులు ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వ్యాపారులకు మక్కలను విక్రయించేందుకు వెళ్లే ట్రాక్టర్లకే అనుమతిస్తున్నారు. తిరిగి మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభించే తేదీలు, గ్రామాల పేర్లను ప్రకటించేంత వరకు మక్కలను తీసుకురావద్దని మార్కెట్ చైర్మన్ సంజీవరెడ్డి పేర్కొన్నారు.
రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు


