కృత్రిమ కొరత సృష్టించొద్దు | - | Sakshi
Sakshi News home page

కృత్రిమ కొరత సృష్టించొద్దు

Apr 29 2026 7:48 AM | Updated on Apr 29 2026 7:48 AM

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

మహబూబాబాద్‌: పెట్రోల్‌, డీజిల్‌ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీఎల్‌ కంపెనీ ప్రతినిధులు, డీలర్లతో పెట్రో కొరతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ స్నేహశబరీష్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజ లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజి ల్‌, పెట్రోల్‌ అందించాలన్నారు. వ్యవసాయ ఆధారిత వాహనాలైన హార్వెస్టర్లు, ట్రాక్టర్లు తదితర వాటిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బంకుల నుంచి డబ్బాలలో డీజిల్‌, పెట్రోల్‌ తీసుకెళ్లకుండా చూడాలన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బంకుల వద్ద ఎలాంటి ఆందోళన పరిస్థితులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలోఅదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, డీసీఎస్‌ఓ రమేశ్‌, కంపెనీల ప్రతినిధులు ప్రణీత్‌, సౌమ్యదీప్‌, హరీశ్‌రాజ్‌, డీలర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement