● కేయూ ఓఎస్‌డీ వెంకట్రాంరెడ్డి
కేయూ క్యాంపస్: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కాకతీయ యూనివర్సిటీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ) ప్రొఫెసర్ బి. వెంకట్రాంరెడ్డి అధ్యాపకులను కోరారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి, వివిధ విభాగాల అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యాపకులు పరిశోధనరంగంలోనూ చురుగ్గా వ్యవహరించాలన్నారు. కళాశాలలో ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి చేశారని, డిగ్రీ బోధన చేపట్టే అధ్యాపకులు ఉదయం 9: 30 గంటల వరకు, పీజీ కోర్సుల బోధన చేపట్టే అధ్యాపకులు ఉదయం 10 గంటల వరకు హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి మాట్లాడుతూ తమ కళాశాల శత వసంతాల విజయోత్సవానికి అందరూ సహకరించాలన్నారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, ఆర్ట్స్ కళాశాల ఫ్యాకల్టీ క్లబ్ చైర్మన్ భిక్షపతి,కోచైర్మన్లు ఫిరోజ్, కనకయ్య, ఆర్. ఆదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


