రెండో రోజు పెట్రోల్, డీజిల్ కోసం వినియోగదారుల కష్టాలు
వినియోగదారులను ఇంధన ఇబ్బందులు వెంటాడుతున్నాయి. రెండో రోజు మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు బంక్‌ల్లో బారులు దీరారు. గంటల తరబడి నిరీక్షించి తమ వాహనాల్లో ఇంధన నింపుకున్నారు. అలాగే, పలువురు రైతులు క్యాన్లు క్యూలో పెట్టి పెట్రోలు, డీజిల్ పోయించుకున్నారు. కాగా, వినియోగదారులు తాకిడితో పలు బంక్‌ల్లో నోస్టాక్ బోర్డులు వెలిశాయి.
పాలకుర్తి టౌన్: జనగామ జిల్లా బమ్మెరలో బంక్‌లో డీజిల్ కోసం క్యాన్లు క్యూలో పెట్టిన రైతులు, వినియోగదారులు
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లి బంక్ వద్ద డీజిల్ కోసం
క్యూ కట్టిన వాహనదారులు


