వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్ర కీర్తి ప్రతిష్ట ప్రపంచ నలుమూలల చాటాలని ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి అన్నారు. హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజుల పాటు జరగనున్న 41వ సౌత్‌జోన్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ మెన్ అండ్ ఉమెన్ పోటీలను మంగళవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. అనంతరం విశిష్ట అతిథి, హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కా ర్యదర్శి డాక్టర్ ప్రీతిపాల్ సింగ్ శాలుజా మాట్లాడు తూ తెలంగాణలో క్రీడాకారులకు ఆతిథ్యం, ఏర్పా ట్లు బాగున్నాయన్నారు. ఇక్కడ ప్రతిభకు కొదవ లేదని, ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల ప్రతిభ గల క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందుతుందన్నారు. తెలంగాణ హ్యాండ్‌బాల్ అసో సియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ మాట్లాడుతూ సౌత్ జోన్ పరిధిలోని తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళం, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి మెన్ అండ్ ఉమెన్ జట్లు హాజరయ్యాయని తెలిపారు. హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బైరబోయిన కై లాస్‌యాదవ్, హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, దుబాకి సంతోష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి
సౌత్‌జోన్ హ్యాండ్ పోటీలు షురూ


