తొర్రూరు రూరల్: పంటల దిగుబడి అధికంగా వచ్చి రైతులు బాగుంటేనే అన్ని వర్గాలకు మేలు కలుగుతుందని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అరిపిరాలలో ఆయిల్ పామ్ నర్సరీ ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝూన్సీరెడ్డితో కలిసి జంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి పంటలు సాగు చేసినా గాలి, వాన, అనేక వ్యాధులు, కోతుల బెడదతో నాశనమవుతున్నాయన్నారు. అందుకే ఎలాంటి నష్టం లేకుండా తక్కువ పెట్టుబడితో నెలకు రెండు సార్లు ఆదాయం వచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. త్వరలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝూన్సీరెడ్డి సహకారంతో ఆయిల్‌పామ్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తూ నం శ్రావణ్‌కుమార్, సర్పంచులు చెంచర్ల స్వాతి, ధారావత్ విజయ, ఆయిల్ ఫెడ్ అధికారులు యా స్మిన్ బాషా, దయాకర్, ప్రవీణ్‌రెడ్డి, మరియన్న, శ్రీనివాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగుతో
నెలకు రెండుసార్లు ఆదాయం
రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి


