కాకతీయ కట్టడాలను రక్షించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కాకతీయ కట్టడాలను రక్షించుకోవాలి

Apr 29 2026 7:48 AM | Updated on Apr 29 2026 7:48 AM

హన్మకొండ కల్చరల్‌ : కాకతీయ కట్టడాలను రక్షించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్‌ మల్లన్న పేర్కొన్నారు. మంగళవారం హనుమకొండ వేయిస్తంభాల దేవాలయాన్ని ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌ (తీన్మార్‌ మల్లన్న) తన సతీమణి మమతతో కలిసి సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఈ సందర్భంగా తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ రుద్రేశ్వరుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భారత ప్రభుత్వం జనగణన చేపట్టినందున సబ్బండ వర్గాలు పాల్గొనాలన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రజనీకుమార్‌, స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజు, నాయకులు పల్లెబోయిన అశోక్‌, బత్తిని వెంకటేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న

Advertisement
 
Advertisement
Advertisement