భారత్‌లోనే గొప్ప సనాతన ధర్మం | - | Sakshi
Sakshi News home page

భారత్‌లోనే గొప్ప సనాతన ధర్మం

Apr 29 2026 7:48 AM | Updated on Apr 29 2026 7:48 AM

గుడిమెట్‌ మహాదేవ్‌ ధర్మ పీఠాధిపతి మహాదేవ్‌ స్వామిజీ

పరకాల : ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప సనాతన ధర్మం భారతదేశంలోనే ఉందని.. అలాంటి దేశంలో హిందువుగా పుట్టినందుకు గర్వంగా భావిస్తు హిందువులంతా ఐక్యంగా దేశం కోసం పాటుపడాలని గుడిమెట్‌ మహాదేవ్‌ ధర్మ పీఠాధిపతి మహాదేవ్‌ స్వామిజీ పిలుపునిచ్చారు. పరకాల పట్టణంలోని పశువుల సంతా ఆవరణంలో హిందువుల ఐక్యతే.. జాతీయ సమైక్యత నినాదంతో హిందూ ధర్మ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ సభకు హిందువులు వేలాదిగా తరలివచ్చారు. సాయంత్రం ప్రారంభమైన సభలో హిందూ ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సభకు ముఖ్యఅతిథాగా మహాదేవ్‌ స్వామిజీ హాజరు కాగా, ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి, ప్రధాన వక్తగా దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి విద్యాభారతి లింగం సుధాకర్‌రెడ్డి, విశ్వహిందూ పరిషత్‌ మాతృశక్తి జిల్లా సహ సయోగిక నీలం నిర్మల హాజరయ్యారు. అనంతరం మహాదేవ్‌ స్వామిజీ మాట్గాడారు. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. హిందు ధర్మానికి సనాతన చరిత్ర కలదన్నారు. సమాజంలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని అంతిమంగా నిజాయితీతో, నిబద్ధతగా గొప్ప వ్యవస్థ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు కొలుగూరి రాజేశ్వర్‌రావు, గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ నాగబండి విద్యాసాగర్‌, ఉపాధ్యక్షుడు పాపిరెడ్డి, పల్నాటి సతీష్‌, మామిడి రమేష్‌, దుప్పటి సాంబశివుడు, పలువురు ప్రముఖులు, హిందువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement