కాజీపేట: కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. ఇటీవల కారు ఢీకొట్టడంతో సైడ్ వాల్ కూలిపోయింది. ఆస్థానంలో ఇటుకలు పేర్చి వదిలేశారు. ప్లాస్టరింగ్ చేయకపోవడంతో గట్టిగా గాలి వచ్చినా కూలిపోయే ప్రమాదం ఉంది. బ్రిడ్జికి ఇరువైపులా గోడలు బీటలు వారి ఎప్పుడు కూలిపోతాయా అన్నట్లుగా ఉన్నాయి. బ్రిడ్జి పక్కనే ఉన్న వెంకటాద్రినగర్ కాలనీవాసులు గోడలు ఎప్పుడు కూలి మీద పడ్తాయేననే భయంతో వణుకుతున్నారు. బ్రిడ్జి గోడలపై మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. ఇటీవల బ్రిడ్జి మరమ్మతుకు రూ.68 లక్షలు మంజూరైనట్లుగా ప్రకటించిన అధికారులు శాశ్వత పనులు చేపట్టకపోవడం చర్చనీయంశంగా మారింది.


