యువత సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యువత సద్వినియోగం చేసుకోవాలి

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

మహబూబాబాద్‌: ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం ప్రచార పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించడమే పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. ఆసక్తి గలవారు టోల్‌ప్రీ నంబర్‌ 1800116090, వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ శ్రీమన్నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలి

పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని చైల్డ్‌ కేర్‌ హోంలో సోమవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా పిల్లలకు సర్టిఫికెట్లతో పాటు క్రీడా సామగ్రి పంపిణీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. షెడ్యూల్‌ ప్రకారం పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. చైల్డ్‌ కేర్‌హోంలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. సామాజిక అంశాలపై అవగాహన కల్పి ంచాలన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ సబిత, సీడీపీఓ శిరీష తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ స్నేహశబరీష్‌

Advertisement
 
Advertisement
Advertisement