బుల్లి రైలింజిన్లు అదుర్స్‌.. | - | Sakshi
Sakshi News home page

బుల్లి రైలింజిన్లు అదుర్స్‌..

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

కాజీపేట రూరల్‌ : కాజీపేట డీజిల్‌ లోకోషెడ్‌లో బుల్లి రైలింజిన్లు అబ్బురపరుస్తున్నాయి. రైల్వే టెక్నీషియన్లు తయారు చేసిన నాటి డీజిల్‌ లోకోలు ఆకట్టుకుంటున్నాయి. విరామ సమయంలో వారు ఎన్నో రకాల కళాఖండాలు తయారు చేసి ప్రదర్శనలో పెట్టారు. వీటిని తిలకించిన సికింద్రాబాద్‌ రైల్వే అధికారులు.. కాజీపేట టెక్నీషియన్ల ప్రతిభాపాటవాలను గుర్తించి అభినందించారు. కాగా, మంగళవారం డీజిల్‌ షెడ్‌ 53వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా డీజిల్‌షెడ్‌, ఎంట్రెన్స్‌, లోకోలను అధికారులు విద్యుత్‌ కాంతులతో ముస్తాబు చేశారు.

అబ్బురపరుస్తున్న బుల్లి రైలు ఇంజన్లు..

డీజిల్‌ లోకోషెడ్‌లో రైల్వే టెక్నీషియన్లు తయారు చేసిన మూడు తరాల బుల్లి రైలింజన్లను ప్రదర్శన నిమిత్తం ప్రత్యేక స్థలంలో ఏర్పాటు చేశారు. ఇవి అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో మొదటిది 30 ఏళ్ల క్రితం ఉపయోగించిన ఆల్కో లోకో, జి–4 లోకో. ఇది మల్టీపర్పస్‌ డ్యూయల్‌ క్యాబిన్‌తో ఉంటుంది. పికప్‌ ఎక్కువ, అధిక లోడు లాగుతుంది. రెండోది డబ్ల్యూఎజీ –7 ఎలక్ట్రిక్‌లోకో. ఇది అధిక గూడ్స్‌ లోడ్‌ లాగుతుంది. మూడోది స్టీమ్‌ లోకో (బ్రిటీష్‌ కాలం నాటిది). పాడైనపోయిన ఇనుప రేకులతో దీనిని తయారు చేసి ప్రదర్శనలో పెట్టారు. ఈ రైలు ఇంజిన్లు చూపరులను అబ్బురపరుస్తున్నాయి.

బ్రిటీష్‌ కాలం నాటి లోకో

ఎలక్ట్రిక్‌ డ్యూయల్‌ లోకో

అబ్బుర పరుస్తున్న నాటి డీజిల్‌ లోకోలు

అద్భుత కళాఖండాలు తయారు చేసిన టెక్నీషియన్లు

ప్రదర్శనలో హెరిటేజ్‌ లోకో

నేడు డీజిల్‌షెడ్‌ 53వ వార్షికోత్సవం

Advertisement
 
Advertisement
Advertisement