శంకర్‌ ఆత్మబలిదానం వృథాకాలేదు | - | Sakshi
Sakshi News home page

శంకర్‌ ఆత్మబలిదానం వృథాకాలేదు

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

నర్సంపేట : డ్రైవర్‌ శంకర్‌ గౌడ్‌ ఆత్మబలిదానం వృథా కాలేదని, ప్రభుత్వం దిగొచ్చి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నేరవేర్చిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం నర్సంపేట ఆర్టీసీ డిపో ఎదుట, ముత్తోజిపేటలో శంకర్‌గౌడ్‌ ఇంటి వద్ద ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యమ చరిత్రలో డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ త్యాగం వెలకట్టలేనిదన్నారు. శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్‌, బీసీ విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్‌ సంఘని మల్లేశ్వర్‌, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు బండి స్వామి, కృష్ణ, గడ్డం యాదగిరి, శ్రీనివాస్‌, ఉపేందర్‌, బీసీ ఆర్టీసీ ఉమ్మడి వరంగల్‌ రీజనల్‌ అధ్యక్షుడు గోలనకొండ వేణు, జిల్లా ఉపాధ్యక్షులు చెన్నూరి రవి, గోడిశాల అశోక్‌, సంగెం రమేశ్‌, కడారి సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

బీసీ సంక్షేమ సంఘం

జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌

Advertisement
 
Advertisement
Advertisement