‘లీప్‌’లో ‘టెమ్రిస్‌’ ఉమ్మడి జిల్లా ప్రిన్సిపాళ్లు | - | Sakshi
Sakshi News home page

‘లీప్‌’లో ‘టెమ్రిస్‌’ ఉమ్మడి జిల్లా ప్రిన్సిపాళ్లు

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థ (టెమ్రిస్‌) ఆధ్వర్యంలో గురుకులాల్లో పనిచేస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి అధికారులు, ప్రిన్సిపాళ్లకు గురుకులాలను మరింత మెరుగైన రీతిలో నడిపేందుకు ‘లీడర్‌షిప్‌ ఫర్‌ ఎక్సిలెన్స్‌ అండ్‌ అకౌంటబిలిటీ ప్రోగ్రామ్‌’(లీప్‌) పేరిట మూడు రోజుల పాటు శిక్షణ అందిస్తున్నారు. హైదరాబాద్‌ దూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్‌ అకాడమీలో ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు శిక్షణ అందిస్తున్నారు. విజన్‌ 2026–27లో భాగంగా ఉత్తమ ఫలితాలు, లీడర్‌షిప్‌ కెపాసిటీ బిల్డింగ్‌, రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్వహణ, అకడమిక్‌ ప్లానింగ్‌, మానిటరింగ్‌, తదితర అంశాలపై శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పనిచేస్తున్న రీజినల్‌ కోఆర్డినేటర్‌ సతీశ్‌, విజిలెన్స్‌ అధికారులు సయ్యద్‌ అక్బర్‌, మక్బూల్‌పాషా, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ రుహీనా, ప్రిన్సిపాళ్లు జి.భిక్షపతి, నీలిమాదేవి, కృష్ణకుమారి, శ్రీనివాస్‌, నీరజ, మాధవీలత, శ్రీపాల, శ్రీలత, రాజు, రమేశ్‌లాల్‌, కుమార్‌, అనిల్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement