హన్మకొండ చౌరస్తా: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వెదవలు అని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాడు పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును భారత్ పాకిస్తాన్‌తో పోల్చినప్పుడు ఎంపీగా తాను, అదే వేదికపై ఉన్న కాంగ్రెస్ ఎంపీలు తీవ్రంగా ఖండించారని పేర్కొన్నారు. ఇదే విషయంపై పార్లమెంటులో తేజస్వి సూర్య వివరణ ఇచ్చారని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎవరు కించపరిచేలా వ్యవహరించిన తెలంగాణ బిడ్డగా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయాలు ఏమీ తెలుసుకోకుండా కేసీఆర్ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను వెదవలు అంటూ మాట్లాడడం సరైనది కాదని తెలిపారు. ఇలాంటి విషయాలు కాకుండా తెలంగాణ అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ సలహాలు, సూచనలు చేయాలని కోరారు.
వరంగల్ ఎంపీ కడియం కావ్య


