మేలు రకం వరి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మేలు రకం వరి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

ఓయూలో గోవిందాపురం విద్యార్థి ఆత్మహత్యాయత్నం

వ్యవసాయ శాస్త్రవేత్త వై. ప్రశాంత్‌

మామునూరు : తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనువైన, మిల్లు యజమానులు ఎక్కువ మొగ్గు చూపే మేలు రకం వరి విత్తనాలు ఎంపిక చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి జి.విజ్ఞాన్‌, శాస్త్రవేత్తలు వై. ప్రశాంత్‌, మానస సూచించారు. సోమవారం వరంగల్‌ బొల్లికుంట రైతువేదిక భవనంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏఓ జి. విజ్ఞాన్‌ అధ్యక్షతన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు‘ అనే కార్యక్రమం, ఎరువుల వినియోగం, సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడుతూ విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో డీలర్ల వద్ద మోసపోకుండా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏఈఓ ఎన్‌.సత్య ప్రకాశ్‌, బీఎస్సీ మూడో సంవత్సరం విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.

గూడూరు: ప్రేమ విఫలమైందనే కారణంతో మనస్తాపం చెందిన మహబూ బాబాద్‌ జిల్లా గూడూరు మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన మైనింగ్‌ కోర్సు చదువుతున్న బోడ వినేశ్‌ సోమవారం హైదరాబాద్‌లోని ఉస్మాని యా యూనివర్సిటీలో పెట్రోల్‌ పోసుకుని ని ప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నా రు. అక్కడ లభించిన ఆ విద్యార్థి సూసైట్‌ నోట్‌ ప్రకారం ప్రేమ విఫలమైందనే కారణంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. విద్యార్థికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

యువకుడి ఆత్మహత్య

నడికూడ: తల్లిదండ్రులతో గొడవ పడి క్షణికావేశంలో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండలో చోటుచేసుకుంది. దామెర ఎస్సై అశోక్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అల్లే తరుణ్‌(25) పరకాలలోని ఓ మొబైల్‌ షాపులో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జల్సాల కోసం తన జీత మే కాకుండా నిత్యం తల్లిదండ్రులను డబ్బు కోసం వేధించేవాడు. ఆదివారం రాత్రి ఇదే విషయంపై తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. సోమవారం కుటుంబీకులు వ్యవసాయ పనులకు వెళ్లగా క్షణికావేశంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement