సెంట్రల్‌ జైలులో పరిపాలన భవనం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ జైలులో పరిపాలన భవనం ప్రారంభం

Apr 28 2026 7:53 AM | Updated on Apr 28 2026 7:53 AM

ఖిలా వరంగల్‌/నర్సంపేట : వరంగల్‌ మామునూరులోని సెంట్రల్‌ జైలు ప్రాంగణంలో ఇటీవల ని ర్మించిన ప్రధాన పరిపాలన భవనాన్ని సోమవారం జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సౌమ్య మిశ్రా ప్రా రంభించారు. ఈ భవనం ద్వారా జైలు పరిపాలన మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని, జైలు నిర్వహణ, భద్రత, ఆధునికీకరణ, సంక్షేమ చర్యలపై అధికారులు దృష్టిసారించాలని ఆదేశించారు.

మహిళా సబ్‌ జైలు సందర్శన..

నర్సంపేటలోని మహిళా సబ్‌ జైలును జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సౌమ్య మిశ్రా సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీల సౌకర్యాలు, సదుపాయాలపై ఆరా తీసి, వారితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో జైళ్ల శాఖ వరంగల్‌ రేంజ్‌ డీఐజీ ఎం. సంపత్‌, వరంగల్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, ప్రొబేషనరీ ఐపీఎస్‌ అధికారి మనీషా నెహ్రా, మామునూరు సెంట్ర ల్‌ జైలు సూపరింటెండెంట్‌ టి.కళాసాగర్‌, డీఎస్డీఓ వెంకటేశ్వరస్వామి, వై.శరత్‌, నర్సంపేట సబ్‌ జైలు సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, జైలర్‌ ప్రభాకర్‌, స్రవంతి, డిప్యూటీ జైలర్‌ కృష్ణకాంత్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement