కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ బ్యారేజీలో జరుగుతున్న బోర్‌హోల్స్ పనులు నత్తనడక సాగుతున్నాయి. ఎన్‌డీఎస్‌ఏ సూచనల మేరకు బ్యారేజీలో 19, 20, 21 పియర్స్ వద్ద పరీక్షలు చేపట్టారు. పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్ బృంద శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతున్నాయి. గడువులోగా పూర్తి చేయాల్సి ఉండగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికే 8 వరకు బోర్‌హోల్స్ వేశారు. సుమారు 500పైగా బోర్‌హోల్స్ వేయాల్సి ఉన్నట్లు తెలిసింది. డ్రిల్లింగ్ మిషన్ల కొరత ఉంది. ఒక్కొక్కటి 15 మీటర్ల నుంచి 30 మీటర్ల లోతు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. భూ భౌతిక (జియో ఫిజికల్), భూ సాంకేతిక (జియో టెక్నికల్), జీపీఆర్ పరీక్షలు చేపడుతున్నారు. ఇందులో భూ భౌతిక పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు పూర్తయితేనే బ్యారేజీ పునరుద్ధరణ చేపట్టనున్నారు.


