మరక చెరగాలి | - | Sakshi
Sakshi News home page

మరక చెరగాలి

Apr 27 2026 8:00 AM | Updated on Apr 27 2026 8:00 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

సాక్షి, మహబూబాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన– పల్లె ప్రగతి 99రోజుల కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంటోంది. అయితే ఇందులో ప్రధాన అంశమైన పిల్లల రక్షణ, డ్రగ్స్‌, గంజాయి రహిత సమాజ నిర్మాణ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కాగా, ఇప్పటి వరకు ఒంటరిగా గంజాయిపై యుద్ధం చేసిన పోలీస్‌శాఖ ఇప్పుడు అన్ని శాఖల సమన్వయంతో ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.

పెరుగుతున్న కేసులు..

ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. ఎంత నిఘా పెట్టినా జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించలేని పరిస్థితి నెలకొంది. ఒక వైపు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటే.. మరో వైపు గంజాయి మత్తులో యువత తూగడం, తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టడం వంటి సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. చేతికి అందవచ్చిన కొడుకు ప్రయోజకుడు అయితే చూసి సంబురపడాల్సిన తల్లిదండ్రులు.. మత్తులో ఇబ్బంది పెడుతున్న కొడును గొడ్డలితో కొట్టి చంపడానికి సిద్ధమయ్యారంటే మత్తు ప్రభావం ఎంత తీవ్రగా ఉందో అర్థం అవుతుంది. ఇలా ఒకటి, రెండు గ్రామాలు, మండలాలు కాదు.. జిల్లా మొత్తం ఈ మహమ్మారి వ్యాప్తి చెందింది.

వారోత్సవాలతో మరక చెరపాలని..

సోమవారం నుంచి ఆదివారం వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే డ్రగ్స్‌, గంజాయి నిర్మూలన కార్యక్రమం విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం సిద్ధమైంది. ఇందుకోసం కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, ఎస్పీ శబరీష్‌ అన్ని శాఖల అధికారులతో సమీక్షించినట్లు తెలిసింది. ప్రతీ మండలంలో పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, విద్యాశాఖ అధికారులు టీమ్స్‌గా గ్రామాల్లోకి వెళ్లడం.. అక్కడ ప్రజాప్రతినిధులు, యువత, మహిళా సంఘాలు, విద్యావంతులు, సామాజిక కార్యకర్తలతో మమేకం కావడం, గంజాయి వినియోగంతో కలిగే నష్టాలను ప్రజలకు తెలపడం, గంజాయి తాగినా, అమ్మినా వెంటనే సమాచారం ఇచ్చేలా ప్రజల్లో చైతన్యం తేవాలన్నదే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. అంతకన్నా ముందుగా గ్రామ సర్పంచ్‌లు, మున్సిపల్‌ వార్డు కౌన్సిలర్లతో పోలీస్‌శాఖ ద్వారా వాయిస్‌ కాల్స్‌, గ్రూప్స్‌ కాల్స్‌ ద్వారా సమాయత్తం చేస్తున్నారు. వీటితోపాటు 15సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసుగల యువకుల జాబితాను గ్రామాల వారీగా సిద్ధం చేసి వారిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ప్రధానంగా వేసవి సెలవుల్లో వారి కదలికపై ఆరా తీయడం, సాయంత్రం పట్టణాలు, గ్రామ శివారుల్లో మఫ్టీలో పోలీసులను పెట్టి వినియోగం, అమ్మకాల గుట్టు రట్టు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. యువతకు ఆటల పోటీలు నిర్వహించడం, స్కిల్‌ డవలప్‌మెంట్‌ వైపు మళ్లించేలా చూడాలని ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఏది ఏం చేసినా.. ఈ వారం రోజులు జిల్లాలోని ప్రతీ ఒక్కరు కీలకంగా భావించి భాగస్వామ్యులు కావాలని ప్రచారం చేస్తున్నారు.

ప్రజాపాలన–పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గంజాయి వారోత్సవాలు

అన్నిశాఖల అధికారులతో కలిసి

కార్యక్రమాలు

నేటి నుంచి గ్రామగ్రామాన

గంజాయి నిర్మూలన నినాదాలు

ప్రణాళికలు సిద్ధం చేసిన పోలీస్‌ శాఖ

Advertisement
 
Advertisement
Advertisement