ఆయా కంపెనీల రీజియన్ మేనేజర్లతో మాట్లాడాను. రేపటి నుంచి డీజిల్ సరఫరా అవుతుంది. సమస్య తీరుతుంది. డబ్బులు చెల్లించిన ఐదు రోజులకు సరఫరా చేస్తున్నారు. సప్లై తక్కువగా ఉండడంతో ఈ సమస్య ఏర్పడింది. జిల్లాలో ఈ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు. లైసెన్స్ రద్దు చేస్తాం.
–రమేశ్, డీసీఎస్‌ఓ
పవర్ పెట్రోల్ పోయించాను..
చాలా బంక్‌ల్లో పెట్రోల్ లేదు. తొర్రూరు రోడ్డులోని ఫాతిమా హైస్కూల్ ఎదుట ఉన్న బంక్‌లో మాత్రం పవర్ పెట్రోల్ ఉంది. చేసేది ఏమీ లేక పోయించాను. దీని వల్ల వాహనం పాడైపోతుంది. అయినా చేసేది ఏమీ లేదు. అధికారులు కొరత లేకుండా చూడాలి.
– అంబటి రవీందర్ రిటైర్డ్ సీఐ, మానుకోట
ఉపాధి లేక
ఇబ్బందులు పడుతున్నాం
నాకు ఉన్న రెండు ట్రాక్టర్లు డీజిల్ లేక రెండు రోజులుగా ఇంటి వద్దనే ఉంటున్నాయి. దీంతో డ్రైవర్లు, కూలీలు ఉపాధి కోల్పోతున్నారు. ఇలాగే కొనసాగితే వాహనాల ఈఎంఐ చెల్లింపులు కూడా కష్టమే. సంబంధిత అదికారులు డీజిల్ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి.
– లక్ష్మీనారాయణ, మానుకోట


