రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

Apr 27 2026 8:00 AM | Updated on Apr 27 2026 8:00 AM

ఖిలా వరంగల్‌ : రైలు కింద పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ సుదర్శన్‌ కథనం ప్రకారం.. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బ్లాక్‌ ప్యాంట్‌, లైట్‌ గ్రీన్‌యాష్‌ క్రీమ్‌ కలర్‌ ఫుల్‌ షర్ట్‌ ధరించి ఉన్నాడు. వయసు 45– 50 మంది ఉండగా.. ఎత్తు 5.5, నలుపు రంగు, నలుపు, తెలుపు తలవెంట్రుకలు, గడ్డం, మీసాలు కలిగి ఉండి, ఎడమ చేతిపై కాలిన గుర్తులు ఉన్నాయి. మృతుడిని గుర్తుపడితే 9701747014,8712658627 నంబర్లకు సమాచారం అందజేయాలని జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు

మహబూబాబాద్‌ రూరల్‌ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం సాయంత్రం మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధి జమాండ్లపల్లిలో చోటుచేసుకుంది. రూరల్‌ బ్లూకోల్ట్స్‌ పీసీలు సంపత్‌, బాపూజీ కథనం ప్రకారం.. మండలంలోని నడివాడ జీపీ పరిధి రంగసాయిపేటకు చెందిన బత్తుల సాగర్‌ బైక్‌పై ఇంటికి వెళ్తున్నాడు. ఈక్రమంలో వెనుక నుంచి ఓ గుర్తుతెలియని కారు.. బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో వరంగల్‌ ఎంజీఎం తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement