వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ స్టేడియంలోని హ్యాండ్‌బాల్ కోర్టులో కొనసాగిన దివంగత ఏఆర్ డీఎస్పీ పీఎస్ శశిధర్ స్మారక 8వ తెలంగాణ రాష్ట్ర హ్యాండ్‌బాల్ టాలెంట్ హంట్ పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్–15 బాలుర విభాగంలో మూడు రోజుల పాటు నిర్వహించిన టోర్నమెంట్‌లో 33 జిల్లాల నుంచి 25 టీమ్‌లు హాజరు కాగా , లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. నువ్వా?నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ పోరులో ఎంఎస్‌ఎస్ కొత్తగూడ జట్టు విజేతగా నిలిచింది. రన్నరప్‌గా టీజీటీడబ్ల్యూఆర్‌జేసీ కాటారం జట్టు, మూడో స్థానంలో టీడబ్ల్యూఎంఎస్ వనపర్తి, నాలుగో స్థానాన్ని టీఎస్ డబ్ల్యూఆర్‌ఎస్ ఎల్లారెడ్డి జట్టు కై వసం చేసుకున్నాయి. ముగింపు వేడుకలకు హైదరాబాద్ సీఐడీ డీఎస్పీ రవికుమార్, హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్ హాజరై విజేతలకు ట్రోఫీ, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, టాలెంట్ హంట్ నిర్వహణ కార్యదర్శి శ్యామల పవన్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బైరబోయిన కై లాస్‌యాదవ్, హ్యాండ్‌బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, రిటైర్డ్ పీడీ రామ్మూర్తి, దివంగత ఏఆర్ డీఎస్పీ పీఎస్ శశిధర్ సతీమణి మమత, తెలంగాణ హ్యాండ్‌బాల్ రెఫరీస్ బోర్డు చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, పీడీలు హరి, సంపత్, తదితరులు పాల్గొన్నారు.
రన్నరప్ కాటారం
ముగిసిన టాలెంట్ హంట్


