1,750 కేజీల నల్లబెల్లం, వంద కేజీల పటిక పట్టివేత | - | Sakshi
Sakshi News home page

1,750 కేజీల నల్లబెల్లం, వంద కేజీల పటిక పట్టివేత

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

ఇద్దరిపై కేసు నమోదు

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో వరంగల్‌ ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో వాహన తనిఖీలు చేపట్టగా ఓ వాహనంలో 1,750 కేజీల నల్లబెల్లం, 100 కేజీల పటిక, 20 లీటర్ల గుడుంబా పట్టుబడిందని ఎకై ్సజ్‌ సీఐ జి.చిరంజీవి ఆదివారం తెలిపారు. ఆ యన కథనం ప్రకారం.. గుడుంబా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటిక, గుడుంబా రవాణాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వరంగల్‌ టీమ్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్‌, ఏటిగడ్డ తండా మధ్య సిబ్బంది తనిఖీ చేశారు. ఇందులో ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన కొరవి రవితేజను అదుపులోకి తీసుకుని విచారించగా సీరోలు మండలం సూర్యా తండాకు చెందిన బానోత్‌ ప్రసాద్‌తో కలిసి చిత్తూరులో తక్కు వ ధరకు తీసుకొచ్చినట్లు ఒప్పుకున్నాడు. నల్లబె ల్లం, పటిక సుందరయ్య నగర్‌, ఏటిగడ్డ తండా, సీరోలు మండలం సూర్యా తండాలో అధిక ధరకు విక్రయించి, వారివద్ద నుంచి గుడుంబా కొనుగోలు చేసి పట్టణాల్లో అమ్ముతూ ఉంటామని, వచ్చిన లాభం ఇద్దరం పంచుకుంటామని నేరం అంగీకరించారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్‌ సీఐ జి.చిరంజీవి తెలిపారు. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎకై ్సజ్‌ సీఐలు నాగేశ్వరరావు, చంద్రశేఖర్‌, సిబ్బంది సత్యనారాయణ, శ్రీనివాస్‌ కుమార్‌, శరత్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement