హన్మకొండ చౌరస్తా: వడదెబ్బతో హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన అంబాల సాంబయ్య (55) మృతి చెందాడు. శనివారం మడికొండలో పెయింటింగ్ పనిచేసిన సాంబయ్య సాయంత్రం ఆటోలో ఇంటికి బయలుదేరాడు. పెద్దమ్మగడ్డ వద్ద ఆటో దిగిన నిమిషాల వ్యవధిలోనే కళ్లు తిరిగి కిందపడ్డాడు. స్థానికుల సాయంతో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య స్వరూప, కుమారుడు శ్యామ్, కూతురు సరిత ఉన్నారు. ప్రభుత్వం ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
బీసీ కాలనీలో మరో వ్యక్తి..
పరకాల: వడదెబ్బతో పరకాల బీసీ కాలనీకి చెందిన కోకిల తిరుపతి( 43) మృతి చెందాడు. శనివారం ఉప్పర పనికి వెళ్లిన తిరుపతి.. రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి పరకాల ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.


