వేసవి దుక్కులతో అధిక దిగుబడి | - | Sakshi
Sakshi News home page

వేసవి దుక్కులతో అధిక దిగుబడి

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

దుగ్గొండి: వేసవికాలం మొదలైంది. యాసంగి పంటలు దాదాపుగా చేతికి వచ్చాయి. రైతులు ఎండాకాలంలో దుక్కిదున్నడం గతేడాది పంట అవశేషాలను ఏరి కాల్చివేయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. జూన్‌లో తొలకరి వర్షాలు రాగానే విత్తనాలు సమకూర్చుకుంటారు. సాగుకు ముందే రైతులు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగితే అధిక దిగుబడులు సాధించవచ్చునని వరంగల్‌ ఏరువాక కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త విజయ్‌భాస్కర్‌ వివరించారు. వేసవిలో రైతులు చేపట్టాల్సిన పనులు, సూచనలు సలహాలు ఇచ్చారు.

భూసార పరీక్షలు..

భూమిలో సారం ఎంత ఉంది? ఏ భూమిలో ఏ పంట వేయాలని నిర్ధారించుకోవడానికి భూసార పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. భూసార పరీక్షల కోసం మట్టిని సరైన పద్ధతిలో తీసుకోవాలి. భూసార పరీక్షల్లో భూమిలో ఏ పోషకాలు ఉన్నాయి.. తక్కువగా ఉన్నవి ఏమిటి? ఎంత ఎరువులు వేయాలి, ఏ పంటను సాగు చేస్తే దిగుబడి వస్తుందని పరీక్షల్లో తేలుతుంది. భూసార పరీక్షలతో అదనపు ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంది. నూతన ఆధునిక యంత్రాల వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం పాటించడంతో అధిక దిగుబడులు సాధించుకోవచ్చు.

వ్యర్థాలను నేలలోనే కలియదున్నాలి..

రైతులు తమ పంట కమతాల్లో సాగు చేసిన పత్తి, మొక్కజొన్న అవశేషాలను కోసి కుప్పగా చేసి కాల్చుతుంటారు. అలా కాకుండా పత్తి మొదళ్లు, మొక్కజొన్న సొప్పను వృథా చేయకుండా మొదట రోటోవేటర్‌తో కలియదున్నాలి. అనంతరం ట్రాక్టర్‌ నాగలితో దున్నాలి. మరోసారి రోటోవేటర్‌తో కలియదున్నాలి. ఈ విధంగా చేయడంతో నేల సారవంతంగా మారి పత్తి, ఇతర పంటలు వేసుకుంటే పంటకు బయటినుంచి అందించాల్సిన ఎరువుల భారం తగ్గుతుంది.

భూసార పరీక్షలు కీలకం

సాగు ప్రణాళిక.. పంటకు మేలు

వరంగల్‌ ఏరువాక కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త నాగభూషణం

Advertisement
 
Advertisement
Advertisement