నయీంనగర్: హనుమకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లిలోని చైతన్య ఆవాస విద్యాలయం 2006 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులంతా ఆదివారం ఒక చోట కలుసుకున్నారు. 20 ఏళ్ల తర్వాత ఆదివారం మనుమకొండ నయీంనగర్ ప్రెసిడెంట్ దాబాలో బాల్య స్మృతులు నెమరు వేసుకున్నారు. ఈఆత్మీయ సమావేశాన్ని ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా వచ్చిన శ్యామ్‌రెడ్డి సమన్వయంతో ఏర్పాటు చేయగా.. కార్యక్రమానికి పాఠశాల గురువులు హంసారెడ్డి, సంజీవరావు, రవీందర్‌తో పాటు ఇతర అధ్యాపకులు హాజరయ్యారు. అదేవిధంగా పాఠశాలలో సేవలందించిన కార్మికులు, అటెండర్లు లక్ష్యయ్య, బతుకమ్మను ఆహ్వానించి గౌరవించారు. పూర్వ విద్యార్థులు తిరుపతి, విజయ్, భాస్కర్, రంజిత్, మహేశ్, విజేందర్, రా జ్‌కుమార్, అనూష, తిరుమల, సంధ్య ఉన్నారు.


