ప్రాణం తీసిన సరదా.. | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన సరదా..

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

పాలకుర్తి టౌన్‌: సరదా.. ప్రాణం తీసింది. వేసవి సెలవులో ఓ బాలుడు తన స్నేహితుడి వద్దకు వెళ్లాడు. అనంతరం ఇద్దరు కలిసి సరదాగా ట్రాక్టర్‌పై వ్యవసాయ భూమి వద్దకు వెళ్తున్నారు.ఈ క్రమంలో మార్గమధ్యలో కారు ఎదురుగా రావడంతో దానిని తప్పించబోయి ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాగా మరో బాలుడు ప్రాణంతో బయటపడ్డాడు. ఈ ఘటన శనివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో చోటు చేసుకుంది. ఎస్సై దూలం పవన్‌కుమార్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాసోజు బ్రహ్మచారి, ఉపేంద్ర దంపతుల రెండో కుమారుడు సాయి సంగీత్‌(15) గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదవి ఇటీవల పదో తరగతి పరీక్ష రాశాడు. ఈ క్రమంలో స్నేహితుడు యాదనాల నితిన్‌తో కలిసి ట్రాక్టర్‌పై అతడి వ్యవసాయ బావిద్దకు వెళ్తున్నారు. నితిన్‌ ట్రాక్టర్‌ నడుపుతుండగా, సాయి సంగీత్‌ పక్కన కూర్చున్నాడు. వ్యవసాయ బావి సమీపంలో ముర్సుగడ్డ తండా వద్ద ఎదురుగా కారు వచ్చింది. దీంతో నితిన్‌ కారును తప్పించే క్రమంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి రోడ్డు పక్క ఉన్న కంధకంలోకి వెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనలో సాయిసంగీత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. నితిన్‌ ఇంజన్‌పై నుంచి దూకి ప్రాణం కాపాడుకున్నాడు. సరదా కోసం వెళ్లి ప్రాణం పోగొట్టుకున్నావా బిడ్డా అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు ప్రతీ ఒక్కరిని కంటతడికి గురి చేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి బ్రహ్మచారి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ట్రాక్టర్‌ నడిపిన బాలుడు.. పక్కన కూర్చున్న మరో బాలుడు

ఎదురుగా వచ్చిన కారును తప్పించబోయి ట్రాక్టర్‌ బోల్తా

ఈ ఘటనలో పక్కన కూర్చున్న బాలుడు అక్కడికక్కడే మృతి

గూడూరులో విషాదం

Advertisement
 
Advertisement
Advertisement