అదనపు కలెక్టర్‌ బదిలీ | - | Sakshi
Sakshi News home page

అదనపు కలెక్టర్‌ బదిలీ

Apr 26 2026 2:39 AM | Updated on Apr 26 2026 2:39 AM

మహబూబాబాద్‌: జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) లెనిన్‌ వత్సల్‌ టొప్పోను బదిలీ చేస్తూ సీఎస్‌ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఆయనను ములుగు జిల్లా ఏటురునాగారం ఐటీడీఏ పీఓగా బదిలీ చేశారు.

రేపు మార్కెట్‌ బంద్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రాంగణం మొత్తం మొక్కజొన్నలతో నిండి ఉన్నందు వల్ల ఈనెల 27వ తేదీ సోమవారం వ్యాపారస్తుల కోరిక మేరకు సెలవు ప్రకటించామని ఏఎంసీ చైర్మన్‌ ఇస్లావత్‌ సుధాకర్‌ శనివారం తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు తరలించి ఇబ్బందులకు గురికావొద్దని ముందస్తుగా ప్రకటన చేస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement