● సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు
● సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
నెహ్రూసెంటర్: ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, పీఆర్‌సీ, గుర్తింపు ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సిబ్బంది సమ్మె విరమించారు. శనివారం తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కాగా, హామీల అమలుకు ప్రభుత్వం చొరవ చూపడంతో మానుకోట డిపో ఆవరణలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి కార్మికులు పాలాభిషేకం చేశారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు మల్లయ్య, ఎంఆర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 11శాతం పీఆర్‌సీ అమలు, యూనియన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్న ల్ ఇవ్వడం సంతోషకరం అన్నారు. సమ్మెలో పాల్గొన్న కార్మికుల ఆకాంక్షలను నెరవేర్చిన ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో పాపిరెడ్డి, రుక్మిణి, ఉష, నబీ, షబ్బీర్, ఖలీల్, బీఏ కుమార్, అశోక్, కిష్టయ్య, భూషణం, ఉద్యోగులు పాల్గొన్నారు.


