మక్క రైతులకు నష్టం కలిగించొద్దు | - | Sakshi
Sakshi News home page

మక్క రైతులకు నష్టం కలిగించొద్దు

Apr 26 2026 2:39 AM | Updated on Apr 26 2026 2:39 AM

గూడూరు: ప్రభుత్వం మక్కలు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి నష్టం కలిగించొద్దని ఏఐకేఎంఎస్‌ జిల్లా కార్యదర్శి గుజ్జు దేవేందర్‌, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమాక్రసీ జిల్లా నాయకుడు గజ్జి లింగన్న డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రం వద్ద శనివారం రెండు పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కల్లాల వద్ద ఇప్పటి వరకు గోనె సంచులు అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 50కిలోలు పెట్టాల్సిన కాంటా బస్తాలో 51కిలోలు పెడు తూ నిర్వాహకులు రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రాల్లో మౌలిక వసతులతో పాటు సంచులు అందుబాటులో ఉంచాలని డిమా ండ్‌ చేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం, కొట్టెం అచ్చన్న, కొట్టెం వజ్జయ్య, కాడబోయిన నర్సయ్య, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement