● తొర్రూరు సివిల్ కోర్టు జడ్జి ధీరజ్‌కుమార్
తొర్రూరు రూరల్: న్యాయ వ్యవస్థ, చట్టాలు, కేసులపై గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు చెందిన అన్నివర్గాల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ధీరజ్‌కుమార్ అన్నారు. శనివారం మండలంలోని బోజ్యతండాలో న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్జి మాట్లాడుతూ.. ప్రతీ వ్యక్తి వివాదాలకు దూరంగా ఉండాలన్నారు. చిన్నచిన్న సమస్యలపై గొవడలు పడి కేసులపాలై పోలీస్‌స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతూ అమూల్యమైన జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రతీ వాహనదారుడు హెల్మెట్ తప్పకుండా ధరించి నెమ్మదిగా ప్రయాణాలు చేస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ మౌనిక, ఎస్సై శివరామకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వివి రత్న, న్యాయనాదులు రామకృష్ణ, నాగరాజు, అశోక్, సంతోష్, గౌస్, రమేశ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..


