నెహ్రూసెంటర్: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమామురళీనాయక్ అన్నారు. మానుకోట ఆర్టీసీ డిపో ఆవరణలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి ఆర్టీసీ కార్మికులతో కలిసి శనివారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో డిపో కార్మికులు, ఉద్యోగులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


